
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించే వీడియోలు ఉంటే..మరికొన్ని కళ్లు బైర్లు కమ్మే దృశ్యాలు ఉంటున్నాయి. అలాగే, మరికొన్ని షాకింగ్ వీడియోలు కూడా ఉంటాయి. కొన్ని రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. ఒళ్లు గగ్గుర్పాటు కలిగించేవిగా ఉంటాయి.. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ తల్లి కూతుళ్లను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన విషాదకర సంఘటన ఇది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే….
రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో విషాద చోటు చేసుకుంది. రోడ్డుపక్కన మార్కెట్కు వెళ్లేందుకు తల్లి చేయి పట్టుకుని నడుస్తున్న ఐదేళ్ల చిన్నారిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి ఆ పాప అమాంతంగా గాల్లోకి ఎగిరి సుమారు 20-25 అడుగుల దూరంలో పడింది. ఈ ప్రమాదంలో బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. కారును ఒక మైనర్ నడిపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..