
క్యారెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ ఒక క్యారెట్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్కువగా కళ్లకు మంచిదని క్యారెట్స్ తింటూ ఉంటారు. కానీ క్యారెట్స్‌తో ఎన్నో ఆరోగ్య, చర్మ, జుట్టు సమస్యలను కంట్రోల్ చేయవచ్చు. క్యారెట్స్ ఆరోగ్యానికి ఇంత మంచిది కాబట్టే.. వీటితో అనేక రెసిపీలు తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా క్యారెట్స్‌తో ఫ్రై, హల్వా వంటివి చేస్తారు. కానీ సూప్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సూప్ తాగడం వల్ల గుండె సమస్యలు కంట్రోల్ అవుతాయి. రక్తం శుద్ధి అవుతుంది. మరి ఈ క్యారెట్ సూప్‌ని ఎలా తయారు చేస్తారు? ఈ సూప్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
క్యారెట్ సూప్‌కి కావాల్సిన పదార్థాలు:
క్యారెట్, బటర్, ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి తరుగు, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, కొత్తిమీర.
క్యారెట్ సూప్ తయారీ విధానం:
ముందుగా క్యారెట్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, వెల్లుల్లి, అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. సాస్ పాన్ తీసుకుని అందులో కొద్దిగా బటర్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయ, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇవి కాస్త రంగు మారాక క్యారెట్ ముక్కలు వేసి ఓ పది నిమిషాలు వేయించాలి. ఇవి వేగాక నీరు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించాలి.
ఇవి కూడా చదవండి
క్యారెట్ ముక్కలు బాగా మెత్తగా అయ్యాక.. కార్న్ ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు వేసి సూప్‌లో వేసి దగ్గరగా చిక్కబడేంత వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ సూప్ సిద్ధం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది ఒక పద్దతి. ఇలా కాకుండా క్యారెట్ ముక్కలు మెత్తగా అయ్యాక మిక్సీలో వేసి రుబ్బి.. ఆ పేస్టులో కొద్దీగా నీళ్లు వేసి సూప్‌లా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇందులో కార్న్ ఫ్లోర్ వాడాల్సిన పని లేదు. ఇలా రెండు రకాలుగా ఎవరి ఇష్టాన్ని బట్టి క్యారెట్ సూప్ తయారు చేసుకోవచ్చు.