
కేసులకు భయపడేది లేదు. కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టబోం. ఇదీ రజతోత్సవ సభ వేదికగా పోలీసులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన హెచ్చరిక. గులాబీ బాస్ వ్యాఖ్యలతో కేసుల విషయాన్ని బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్గా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఎల్కతుర్తి సభ వేదికగా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారియర్స్పై ఎందుకు కేసులు పెడుతున్నారన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..