
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో.. ఫైటర్స్‌ని తన మాటలతో మార్చేస్తుంది కావ్య. ఇప్పుడు ఎలాగో కాసేపట్లో పోలీసులు వస్తారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే.. మీ భార్యలు, పిల్లలు అడుక్కుతింటారని అంటుంది. కావ్య మాటలకు అక్కడి నుంచి రౌడీలు పారిపోతారు. ఇక రాజ్ యాక్షన్‌లోకి దిగుతాడు. తన స్టైల్లో చితక్కొడతాడు. అప్పటికే పోలీసులు బయట ఉంటారు. నంద గోపాల్ని పోలీసులకు అప్పజెప్పుతాడు. పోలీసులు తీసుకెళ్తుండగా బైక్ పై నుంచి ఒక వ్యక్తి కాల్చి వెళ్లిపోతాడు. దీంతో కావ్య, రాజ్‌లు షాక్ అవుతారు. రాజ్.. వీడు చచ్చిపోయాడు. ఇందంతా చూస్తుంటే ఎవరో కావాలనే ప్లాన్ చేసినట్టు ఉంది. ఇక్కడే మీరు ఉంటే ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు పోలీసు. బాధతో అక్కడి నుంచి రాజ్, కావ్యలు బయలు దేరతారు. దీంతో రాజ్, కావ్యలు చాలా బాధ పడతారు. ఏంటి ఇలా జరిగింది.. వాడిని తీసుకెళ్లి వంద కోట్లు మోసం బయట పెడదాం అనుకున్నాం. కానీ ఇలా జరిగింది ఏంటి? అంటూ బాధ పడతాడు.
ధాన్యలక్ష్మిని మరింత రెచ్చగొట్టిన రుద్రాణి..
మరోవైపు ధాన్యలక్ష్మిని మరింత రెచ్చగొడుతుంది రుద్రాణి. నేనూ నా కొడుకు రాత్రి, పగలు కష్ట పడి మరీ క్లూస్ నీ చేతిలో పెడుతుంటే.. నువ్వు వాళ్లని అలా సింపుల్‌గా వదిలేశావు. ఉన్న అవకాశాన్ని కూడా చేయి జారిందని రుద్రాణి అంటుంది. వాళ్లు ఈ దేశం అయితే వదిలి పారిపోలేదు కదా అని ధాన్యలక్ష్మి అంటే.. ఇంట్లోంచి వెల్లిపోయారు కదా.. సాయంత్రం వరకు ఏం చెప్పాలో మరో స్టోరీ వెతుక్కుని వస్తారని అంటుంది. అప్పుడే రాహుల్ వచ్చి.. కావ్య, రాజ్ వాళ్లు అసలు ఈ రోజు ఆఫీస్‌కి వెళ్లలేదట అని చెప్తాడు. అవును అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పటికైనా అర్థమైందా? చూస్తూ ఉండు సాయంత్రానికి కథ బాగా ప్రిపేర్ చేసుకుని వస్తారు. వాళ్లు చెప్పిన స్టోరీ విని నువ్వు నమ్మేస్తావని రుద్రాణి అంటుంది. నువ్వు అలాగే అనుకో.. వాళ్లు సాయంత్రం ఇంటికి రాగానే ఎలా కడిగి పారేస్తానో చూడమని ధాన్యలక్ష్మి అంటుంది.
ఇంటికి వెళ్లాలి అంటేనే భయంగా ఉందన్న రాజ్..
మరోవైపు కారులో రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్లి ఏం చెప్పాలో తెలీడం లేదు. నిజం చెబితే ఎవరు ఏం అనుకుంటారో.. ఆస్తులు పంచాలని గొడవ చేస్తారో ఏంటో.. అనవసరంగా నిన్ను కూడా ఇందులోకి లాగాను సాయంత్రం ఇంటికి వెళ్లాలి అంటేనే చాలా భయంగా ఉంది. వాళ్లందరూ ఎలాంటి ప్రశ్నలు వేస్తారో.. ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ వంద కోట్లు ఎక్కడి నుంచి తీసుకు రావాలి? అంటూ రాజ్ బాధ పడతాడు. ఏవండీ మీరేం బాధ పడకండి.. ఏదో ఒకటి చేద్దామని కావ్య అంటుంది. రాజ్, కావ్యలు ఎప్పుడు ఇంటికి వస్తారా? అంటూ ఇంట్లోని వాళ్లు ఎదురు చూస్తారు. అప్పుడే రాజ్, కావ్యలు ఇంటికి వస్తారు.. ఇక రుద్రాణి, ధాన్యలక్ష్మిలు వరుసగా ప్రశ్నలు వేయడం మొదలు పెడతారు. గెస్ట్ హౌస్‌ని ఎందుకు తాకట్టు పెట్టారు? ఆ డబ్బును ఏం చేశారని? అడుగుతారు. కావ్య, రాజ్‌లు ఏం సమాధానం చెప్పకుండా నిల్చుంటారు.
ఇవి కూడా చదవండి
ఏం నాటకాలు ఆడుతున్నారు..
ఎవరు ఏం అన్నా అస్సలు పడేదానివి కాదు.. అసలు ఏమైంది? ఆ నిజం చెప్పకుండా దోషిలా నిల్చున్నారేంటి? ఇంత దూరం వచ్చాక మౌనంగా ఉండకూడదు. అందరికీ నిజం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎంత కాలం తప్పు మీ మీద వేసుకుంటారు? అది ఏదైనా మీరు చెప్పాల్సిందేనని సుభాష్ అంటే.. నన్ను క్షమించండి మావయ్య గారు ఇప్పుడు నేనేమీ చెప్పలేనని కావ్య అంటుంది. ఏంటి.. ఇప్పుడేం చెప్పలేవా? ఉదయం నుంచి మేమందరం మీరు ఏం చెబుతారా అని వెయిట్ చేస్తున్న వాళ్లం ఫూల్సా అని రుద్రాణి, ఏం నాటకాలు ఆడుతున్నావా? మీ అమ్మ నాటకాలు మొదలు పెట్టి.. మీ ముగ్గుర్నీ మా కుటుంబానికి అంటగట్టేసి.. అనుకున్న పని పూర్తి అయిపోయి.. నిన్ను ముందుకు తోసిందా.. నీతో ఈ నాటకాలన్నీ ఆడిస్తోందా? అని ధాన్యలక్ష్మి అంటుంది. అసలు మీరు ఈ రోజు ఆఫీస్‌కే వెళ్లలేదట.. ఏంటి కారణం.. మరి ఎక్కడికి వెళ్లారు? అని రుద్రాణి నిలదీస్తుంది.
నిజం చెప్పేయబోయిన రాజ్..
దీంతో షాక్ అవుతారు రాజ్ వాళ్లు. ఏం నిజం కావాలి మీకు? ఆ నిజం చెబితే మీరు తట్టుకోలేరు. ఎందుకు నా భార్యని రోజుకో విషయంలో దోషిగా నిలబెట్టి నిందలు వేస్తున్నారు? ఆమె నిజాయితీని మీకు నిరూపించుకోవాల్సిన అవసరం లేకపోయినా.. నా తల్లిదండ్రులకు, నాన్నమ్మకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి.. చెబుతున్నా అసలు ఆ గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టామో తెలుసా? అని రాజ్ నిజం చెబుతుంటే.. కావ్య ఆపేస్తుంది. ఇక ఇవాళ్టితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..