

మన శత్రు దేశం పాకిస్థాన్ నుంచి ఏదో ఒక విధంగా ముప్పు పొంచి ఉండనే ఉంటుంది. బార్డర్లో సైనికులు కాపాలాగా ఉన్నా.. ప్రస్తుత టెక్నాలజీని ఉపయోగించుకొని ఇండియాను ఇబ్బంది పెట్టేందుకు ఆ దేశంలో ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(CMO)పై దాడి జరుగుతుందని బుధవారం మధ్యాహ్నం బెదిరింపు సందేశం వచ్చింది. అది మెసేజ్ వాట్సాప్ ద్వారా రావడం గమనార్హం. పాకిస్తాన్ ఫోన్ నంబర్ నుండి వర్లి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ సందేశం వచ్చింది. ఇది తీవ్రమైన భద్రతా సమస్యలను లేవనెత్తింది.
దీంతో వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు ఆ నంబర్ ఎవరిది? కచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలను ఆరా తీశారు. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయానికి పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. సాధారణంగా సీఎం ఆఫీస్‌కు గట్టి బందోబస్తు ఉంటుంది. ఇప్పుడు ఈ బాంబు బెదిరింపు నేపథ్యంలో భద్రతా మరింత పెంచారు. బెదిరింపు తర్వాత, ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతర అధికారులు ఆ మెసేజ్ ఎవరు పంపారు? ఉగ్రవాదుల నుంచి ఏమైన ముంపు పొంచి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.