

నల్ల మిరియాలు ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే మసాలా. అపారమైన ఔషధ గుణాలు కలిగిన ఈ ధాన్యం డజన్ల కొద్దీ ప్రయోజనాలను కలిగి ఉంది. నల్ల మిరియాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ రెండు నల్ల మిరియాల గింజలు తినడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు రెండు నల్లమిరియాలు తినటం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మిరియాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మిరియాలను తినడం వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు కూడా తగ్గుతాయి. మిరియాలలో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. చలికాలంలో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. కనుక ఈ నొప్పులు ఉన్నవారు మిరియాలను రోజూ తినాల్సి ఉంటుంది. నల్ల మిరియాలు వాత దోషాన్ని తొలగిస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. నల్ల మిరియాలు శరీర కొవ్వును కరిగించి క్యాన్సర్తో కూడా పోరాడుతాయి. మిరియాలలో పైపరైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో మెదడు ఉత్తేజంగా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
ప్రతి రోజూ ఉదయాన్నే రెండు నల్లమిరియాలు తినటం వల్ల రోజంతా మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. దగ్గు, జలుబు ఉన్నవారు మిరియాలను తినటం వల్ల ఫలితం ఉంటుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. అజీర్తి తగ్గుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. మిరియాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. చర్మానికి రక్షణ లభిస్తుంది. నల్ల మిరియాలు తినడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు, తలపై ఫంగస్ నివారిస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..