

ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు అధికారికంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి గుడ్‌బై చెప్పారు.
అయితే తమ విడాకులపై ఇరువురు పెద్దగా స్పందించింది లేదు. అదో విచారకర సందర్భంగా బిల్‌గేట్స్ విడాకుల తొలినాళ్లలో పేర్కొన్నారు. మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కూడా ఇప్పటి వరకు మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో స్పందించడం ఆసక్తిగా మారింది. “అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా మెలిండా చెప్పుకొచ్చారు.
అయితే బిల్‌గేట్స్ గురించి మాత్రం మాట్లాడనని చెప్పేశారు. ఇప్పుడు ఎవరి సొంత జీవితాలు వారివి అయిపోయాయి. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగంతో కూడుకున్న భారమైన చర్య అన్నారు. విడాకుల సమయంలో తానెంతో భయపడినట్లు చెప్పారు. దాంపత్య బంధం వదులుఉంటున్నప్పుడు ఎంతో బాధగా ఉంటుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. తాను భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదన్నారు మెలిండా. కొన్ని కష్టాలను ఎదుర్కొన్నందువల్లే విడిపోవాల్సి వచ్చిందని చెప్పారు.
బిల్‌గేట్స్ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్(22)లు జన్మింఆచారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్‌గేట్స్ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు.