
తమలపాకులో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు చాలా మందకి తెలియదు.. ఇందులో ఉండే విటమిన్స్ అన్నీ ఇన్నీ కావు. తమలపాకులో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ ఈలు ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, కాల్షియం, అయోడిన్, పాస్ఫరస్, ఐరన్, అమైనోయాసిడ్స్, ఎంజైమ్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా పనిచేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకుల్ని మనం సరైన విధంగా తీసుకుంటే షుగర్ దగ్గర్నుంచీ చాలా సమస్యలకి చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. తమలపాకుల్ని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
తమలపాకు తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. ఈ ఆకు వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్య రాదు. తమలపాకు వల్ల రొంప సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు తమలపాకు షుగర్ కూడా నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటీవ్ మెరుగు చేస్తుంది. తమలపాకుల్ని మనం జ్యూస్‌లా చేసుకుని తాగొచ్చు. దీని వల్ల మనకి శ్వాస సమస్యలు దూరమవుతాయి.
పంటి సమస్యతో బాధపడుతున్న వారు తమలపాకు తీసుకోవాలి. ఇందులో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇది పళ్లలో బ్యాక్టీరియా పెరగకుండా చిగుళ్లను పంటిని కాపాడుతుంది. అంతేకాదు తమలపాకు తీసుకోవడం వల్ల జీర్ణ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. ఇది డైజెస్టివ్ ఎంజైమ్‌లను వేరు చేయడంలో సహాయపడుతుంది. తమలపాకులో గాయాలు నయం చేసే గుణాలు కూడా ఉంటాయి. తమలపాకు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..