
తాజా, ఆరోగ్యకరమైన చర్మానికి, బరువు తగ్గడానికి సహాయపడే పానీయాలను క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా అవసరం. ఇందులో భాగంగా కొందరు మునగాకు వాటర్ లేదంటే, లెమన్ గ్రాస్ వాటర్ తాగుతుంటారు. ఈ రెండు వాటికవే ప్రత్యేకమైనవి. మునగ నీరు, లెమన్ గ్రాస్ నీరు రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ బ్యూటీ డ్రింక్ తెలుసా..? ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మునగ ఆకు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి తేజస్సు ఇచ్చి మురికి తొలగించడంలో సహాయపడుతుంది. మునగాకుతో ఈ లాభాలు ఆ పొడిని నీళ్లలో కలిపి మొహం మీద లేదా బాడీకి నల్ల మచ్చలు ఏర్పడినచోట రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి..లేదా ఆకులను కడిగి కొద్దిసేపు నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వలన చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మునగ నీరు చర్మ కణాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. చర్మ కాంతి, ఆరోగ్యంగా ఉండటానికి మునగ నీరు మంచిది. మునగలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే బి విటమిన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి మన తలకు కావలసిన పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా మార్చి అవి పెరిగేలా చేస్తాయి. జుట్టు మెరిసేలా చేయడంలో ఈ విటమిన్లు, ఖనిజాలు ముందుంటాయి.
ఇక, లెమన్ గ్రాస్ వాటర్ విషయానికి వస్తే.. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసి, చర్మాన్ని మృదువుగా మార్చి, మెలానిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ నీరు మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. రక్తాన్ని శుభ్రం చేసేందుకు, కొవ్వు కరిగించేందుకు లెమన్ గ్రాస్ నీరు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. బరువు తగ్గడానికి లెమన్ గ్రాస్ నీరు ఉపయుక్తంగా ఉంటుంది. మీ అవసరాన్ని బట్టి ఈ రెండు బ్యూటీ డ్రింక్స్‌లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..