
ప్రస్తుత కాలంలో మనలో చాలా మందికి జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. పొడి జుట్టు, తెల్ల జుట్టు, హెయిర్ ఫాల్, బట్ట తల వంటి సమస్యలు పెరిగాయి. బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, కాలుష్యం, దుమ్ము వంటి కారణాల వల్ల జుట్టుకు ఎక్కువగా నష్టమవుతుంది. దీంట్లో అందరికి కామన్ గా ఉండేది హెయిర్ ఫాల్. మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచే అద్భుతమైన ఆహారాలు చాలానే ఉన్నాయి. ఈ ఆహారాలు జుట్టును బలపరచడం, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎలాంటి సమస్యలు రావు. అయితే, చాలా మంది చేసే పొరపాటు సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం. మీ ఆహారపద్ధతిని క్రమంగా పాటిస్తే, జుట్టు రాలే సమస్య తగ్గడంతోపాటు జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సహజ పద్ధతులు పాటించడం చాలా అవసరం. ఈ సమస్యకు కొన్ని ఆహారాల ద్వారా తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్స్
ఎగ్స్ ప్రోటీన్, బయోటిన్‌కు మంచి మూలం. ఇవి జుట్టు బలాన్ని పెంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి.
కందగడ్డలు (Sweet Potatoes)
కందగడ్డలలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, తేమతో ఉంచడంలో సహాయపడుతుంది.
పాలకూర
జుట్టు పెరుగుదల కోసం అవసరమైన ఫోలేట్, ఐరన్, విటమిన్ A, విటమిన్ C లాంటి విటమిన్లు పాలకూరలో ఉన్నాయి. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
ఓట్స్
ఓట్స్‌లో ఫైబర్, ఐరన్, జింక్, ఒమెగా-6 ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టుకు అవసరమైన పోషకాల కోసం సహాయపడతాయి.
క్యారెట్లు
క్యారెట్లు కంటికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటి జింక్, ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్న ఆహారాలు జుట్టును బలపరుస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)