
సలాడ్లలో, సాస్ డిప్ అవకాడోను వాడటం మనకు అలవాటే. అయితే అరేబియన్లు సౌందర్య పరిరక్షణలోనూ దీనిని భాగం చేస్తారట. అవకాడో గుజ్జులో తేనె, నిమ్మరసం, కాస్త కొబ్బరినూనె కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అవకాడో నూనెతో మసాజ్ చేసుకున్నా ఫలితం ఉంటుంది.