
ఆగ్నేసియా దేశాలైన మయన్మార్, థాయ్‌లాండ్ లను భూకంపాలు అతలాకుతలం చేశాయి. భూదేవి ప్రకోపించడంతో మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలు విలవిల్లాడుతున్నాయి. వందలాదిమంది మృతి చెందారు. శిధిలాల కింద ఇప్పటికే అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకేసారి వరస వరసగా సంభవించిన ఈ భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా 2025లో భారీ భూకంపాలు సంభవిస్తాయని చెప్పిన జ్యోస్యం నిజం అవుతుందా అనే ఆలోచన మొదలైంది. బాబా వంగ జోస్యంచర్చనీయాంశంగా మారింది.
బాబా వంగా ఎవరు?
బల్గేరియన్ కి చెందిన ప్రముఖ అంధ ఆధ్యాత్మిక వేత్త బాబా వంగా. ఆమె చెప్పిన అనేక విషయాలు ఇప్పటికే నిజం అయ్యాయి. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, మహమ్మారులు , అమెరికాలో అల్‌ఖైదా ఉగ్రవాదుల 9/11 దాడులు, బ్రెగ్జిట్ సహా అనేక అంచనాలు నిజం అయ్యాయి. ఇప్పుడు బాబా వంగ 2025 కోసం చెప్పిన భూకంపంతో మళ్లీ బాబా వంగా హాట్ టాపిక్‌గా మారింది. 2025 సంవత్సరానికి సంబంధించిన కొన్ని అంచనాల్లో ఒకటి వాతారణంలో మార్పులు. సమస్త మానవాళి వరదలు, తుఫాన్లు, హరికేస్లు, సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలతో అనేక ఇబ్బందులు పడతారని.. యుద్ధాలు వంటి కారణాల వలన భూమికి పెను ముప్పు ఏర్పడనుందని బాబా వంగా వేసిన అంచనాను గుర్తు చేసుకుంటున్నారు.
మయన్మార్, థాయ్‌లాండ్ లో భూకంప ప్రభావం
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో సంభవించిన భూకంపలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు కుప్పకూలాయి. రహదారులు నాశనం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపం ప్రభావం కొనగుతూనే ఉందని.. అప్పుడప్పుడు భూప్రకంపనలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పుడు బాబా వంగా చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా అనే ఆలోచన అందరిలో మొదలైంది. మ
ఇవి కూడా చదవండి
విజ్ఞాన శాస్త్రం లేదా జోస్యం?
బాబా వంగా చెప్పిన భవిష్యవాణి నిజం అవుతుందా.. లేక యాదృచ్ఛికమా అంటూ కొంతమంది నిపుణులు చర్చిస్తున్నారు. అయితే భూకంపాల గురించి శాస్త్రవేత్తలు కూడా అనేక సంవత్సరాల క్రితమే హెచ్చరికలు జారీచేశారు. బాబా వంగా భవిష్య వాణి మరిన్ని నిజమవుతాయా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..