వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు చాలా మందికి దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే కొందరికి దగ్గు ఎంతకూ తగ్గదు. అన్ని సీజన్లలో దగ్గు వేదిస్తుంటుంది. ఇలాంటి దీర్ఘకాలిక దగ్గు సమస్యలకు గతంలో నానమ్మలు, అమ్మమ్మలు వివిధ ఇంటి చిట్కాలను వినియోగించేవారు. దీర్ఘకాలిక దగ్గుకు తమలపాకులను కాల్చి వాటి బూడిదను తేనెతో కలిపి పిల్లలకు పట్టిస్తే దగ్గు ఇట్టే మాయం అయ్యేంది. ఇది సాంప్రదాయ జానపద ఔషధం. పూర్వ కాలం నుంచి చాలా ఇళ్లలో అమ్మమ్మలు ఈ చిట్కాను అనుసరించేవారు. తమలపాకు, తేనెలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో, ఇది దగ్గుకు ఎలా పని చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
తమలపాకుల్లో ఔషధ గుణాలు
దగ్గు నిరోధక లక్షణాలు
ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో వినియోగించే తమలపాకులను దగ్గు, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలకు ఉపయోగిస్తారు. దీని కఫహర లక్షణాలు కఫం లేదా శ్లేష్మం తొలగించడంలో సహాయపడతాయి.
యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ
తమలపాకులలో సూక్ష్మక్రిములను తొలగించడంలో, గొంతు మంటను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు తమలపాకులో ఉంటాయి. తమలపాకుతోపాటు దగ్గు చికిత్సలో తేనె కూడా ప్రభావం పనిచేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. దాని ఔషధ గుణాలు ఏమిటంటే..
ఇవి కూడా చదవండి
సహజ దగ్గు అణిచివేత
తేనె సహజ దగ్గును అణిచివేస్తుంది. దీని మందపాటి జిగట గొంతులోని వాపు కణజాలాలపై రక్షణ పొరను సృష్టిస్తుంది. తద్వారా గొంతు చికాకును తగ్గిస్తుంది. దగ్గును సైతం క్రమంగా తగ్గిస్తుంది.
యాంటీమైక్రోబయల్ లక్షణాలు
తేనెలో సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
తమలపాకులను కాల్చిన బూడిదలో తేనె కలిపి సేవిస్తే దగ్గు తగ్గుందనడానికి నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఆ సాంప్రదాయ వైద్య పద్ధతిలో ఆకులను కాల్చడం వల్ల వాటిలోని కొన్ని భాగాలు కేంద్రీకృతమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది అనారోగ్య సమస్యలకు మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. తమలపాకుల కఫహర, శోథ నిరోధక లక్షణాలు దగ్గు నుంచి ఉపశమనం పొందడంలో పనిచేస్తాయి. ఇది గొంతు అసౌకర్యాన్ని తగ్గించడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఉపయోగించే ముందు తమలపాకు కాల్చిన బూడిద నాణ్యత చాలా ముఖ్యం. సాధారణంగా తమలపాకు రసం లేదా తమలపాకు టీ సురక్షితమైనదిగా భావిస్తుంటారు. అదే తమలపాకులను కాల్చి తేనెతో కలిపే విధానంలో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది దీర్ఘకాలిక దగ్గు సందర్భాలలో దీనిని వినియోగిస్తారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
