
అవకాడో పండు గురించి చాలా మందికి తెలియదు? ఈ పండు రుచితో పాటు ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా కలిగి ఉంటుంది. మార్కెట్లో దీని ధర చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని ఆరోగ్యకరమైన లక్షణాల కారణంగా చాలా మంది ఎంత ఖరీదైనా కొనుగోలు చేస్తున్నారు. అవకాడో పండులో అమృతం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సైతం అంటున్నారు. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అవకాడోను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు రుజువు చేశాయి. అంతేకాకుండా నేటి కాలంలో పెరుగుతున్న ఊబకాయం సమస్యను వదిలించుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. కాబట్టి అవకాడో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
అవకాడో ఎందుకు తినాలి?
సాధారణంగా ఆరోగ్యం బాగుంటే ఆసుపత్రికి దూరంగా ఉండవచ్చు. ఇది జరగాలంటే మన ఆహార ఎంపికలు సరిగ్గా ఉండాలి. అప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అటువంటి ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో అవకాడో ఒకటి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో పొటాషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలేట్, ఫైబర్ ఉంటాయి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడుతుంది. అందుకే అవకాడో క్రమం తప్పకుండా తినాలని సూచిస్తుంటారు వైద్యులు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అవకాడోలో లభించే పోషకాలు, ఫైబర్ కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇవి కూడా చదవండి
బరువు నియంత్రణలో ఉంటుంది
అవకాడోలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించడం ద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. క్రమంగా మీరు స్లిమ్‌గా మారవచ్చు.
చర్మానికి మంచిది
అవకాడోలో లభించే విటమిన్లు, ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇందులో ఫోలేట్, విటమిన్ ఇ కూడా ఉన్నాయి. అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
మానసిక ఆరోగ్యానికి
అవకాడోలలో సహజంగా లభించే ఫైబర్, ఫోలేట్, విటమిన్లు మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ అంశాలు ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంచివి.
పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది
అవకాడోలో లభించే ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.