కన్య: ఈ రాశివారికి శని, గురువుల అనుకూలత వల్ల కొత్త సంవత్సరంలో తప్పకుండా రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. గౌరవమర్యాదలు, పలుకుబడి వృద్ది చెందుతాయి. అనేక విధాలుగా ఆస్తి కలిసి వచ్చి ఒక సంపన్నుడుగా గుర్తింపు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కూడా అపారంగా లాభిస్తాయి. వీరి సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు.
