
కన్నడ యాక్షన్ హీరో అర్జున్ సర్జా గురించి చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అర్జున్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ చేయగా భారీ విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో హీరోగా అలరించిన అర్జున్.. ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా అర్జున్ సర్జా చిన్న కూతురు అంజనా త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె ప్రియుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అంజనా స్వయంగా వెల్లడిస్తూ సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోస్ షేర్ చేసింది. “అవును.. మీరనుకునేదే.. 13 ఏళ్ల తర్వాత నెరవేరింది” అంటూ నిశ్చితార్థం జరిగినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నారు.
అంజనా షేర్ చేసిన ఫోటోలలో ఆమె ప్రియుడు మోకాలిపై కూర్చుని ఆమెకు ప్రపోజ్ చేస్తున్నట్లు కనిపించాడు. మరో ఫోటోలో అంజనాను ఎత్తుకుంటే వెనకాల అర్జున్ సర్జా దంపతులు.. ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. మరో ఫోటోలో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమపక్షులు నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అర్జున్ సర్జా పెద్ద కూతురు ఐశ్వర్య గతేడాది నటుడు ఉమాపతి రామయ్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
అర్జున్ సర్జా తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988లో నటి నివేదితను పెళ్లి చేసుకున్నాడు అర్జున్. వీరికి కూతుర్లు ఐశ్వర్య, అంజన ఉన్నారు. పెద్ద కూతురు ఐశ్వర్య కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. గతేడాది నటుడు ఉమాపతిని వివాహం చేసుకుంది. ఇక అంజన.. నటన వైపు కాకుండా వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఆమె సర్జా వరల్డ్ కంపెనీని స్థాపించి సీఈవోగా పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?