
అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రిమిలినరీ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ఏడాది మే 25న ఈ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ ఇప్పటికే జారీ చేసింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 28,451 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా వారిలో 18,037 అంటే 82.02 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను మార్చి 18వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.
ఇక మెయిన్స్ రాత పరీక్షలు మార్చి 26, 27 తేదీల్లో ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 3 పేపర్లకు జరగనున్నాయి. ఈ మూడు పేపర్లు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటాయి. పేపర్ 1 పరీక్ష మార్చి 26 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 పరీక్ష మార్చి 27న ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 3 పరీక్ష అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాగా మొత్తం 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ కొనసాగిస్తున్నారు.
ఏపీపీఎస్సీ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మెయిన్ పరీక్షల హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.