
అమరావతి, ఏప్రిల్ 23: ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని మొత్తం 11,819 బడుల నుంచి 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా పదో తరగతి ఫలితాలు మంత్రి లోకేష్ ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణత పొందారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 5.78 శాతం అధిక ఉత్తీర్ణత నమోదు చేశౄరు.
1680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా రాష్ట్రంలోనే అతి తక్కువ ఉత్తీర్ణత 47.64 శాతం నమోదు చేసింది. గురుకుల విద్యాలయాల్లో అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం విద్యార్ధుల్లో ఫస్ట్ డివిజన్లో 65.36%, సెకండ్ డివిజన్లో 10.69%, థార్డ్ డివిజన్లో 5.09% ఉత్తీర్ణత పొందారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి