
అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 81.14 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మార్చి 17 నుంచి మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,14,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. మొత్తం 1,680 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. 19 పాఠశాలల్లో ఒక్క విద్యార్ధి కూడా పాస్ కాలేదు. గత ఐదేళ్లలో 2022లో అతితక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. అత్యధికంగా ఈ ఏడాదే (2025) ఏకంగా 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఏపీ పదో తరగతి 2025 పబ్లిక్ పరీక్షల ఫలితాలు
తాజా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్ధులు రీకౌంటిగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు రేపట్నుంచి అంటే ఏప్రిల్ 24, 2025వ తేదీ ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మే 1 రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటికగ్కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించవల్సి ఉంటుంది. అలాగే రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.