
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. అక్కడ జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన చంద్రబాబు నాయుడు.. వారికి నేరుగా పెన్షన్లు అందజేశారు. అనంతరం జరిగిన టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు అయిన తరువాత, పార్టీ కోసం రక్తం చిందించిన టీడీపీ కార్యకర్తల కోసం, కూర్చుని మాట్లాడుకోలేక పోయామని అంగీకరించారు. పార్టీ కార్యకర్తలతో తాను మాట్లాడి 9 నెలలు అయ్యిందన్నారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని కలవటానికి వచ్చానన్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్యాప్ రాదని కార్యకర్తలకు మాటిస్తున్నట్లు చెప్పారు.
ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవన్నారు చంద్రబాబు నాయుడు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయని చెప్పారు. అందుకే పింఛన్లు ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పాన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు రావాలని.. అదే తన కోరికగా పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు ఎన్నో బాధలు పడ్డారని.. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించి ప్రజలు మంచి పని చేశారని. ప్రజలు ఇచ్చిన తీర్పు రాష్ట్రానికి సంజీవనిగా మారిందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిందని.. ఇప్పుడు అప్పు అడిగినా ఎవరూ ఇవ్వడంలేదని చంద్రబాబు తెలిపారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేసిన చంద్రబాబు నాయుడు..
చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు పేదల సేవలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించారు. అనంతరం రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు, లబ్ధిదారులకు వివిధ పథకాలను అందించారు. పార్టీ కార్యకర్తలను అభినందించారు.… pic.twitter.com/RFacOgA3vU
— Telugu Desam Party (@JaiTDP) March 1, 2025
2014-19 మధ్య మనం ఎన్నో మంచి పనులు చేసినా, మనం చెప్పుకోలేక పోయామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలో తాను తన పని చేసుకుంటూ పోయాను, మీరు మీ పనులు చేసుకున్నారు. పార్టీని విస్మరించామని అన్నారు. అందుకే 2004, 2019లో మనల్ని ఎవరూ ఓడించలేదు. మనకు మనమే ఓడించుకున్నామని వ్యాఖ్యానించారు. తాను ఎవరికైనా ఎక్కువ రుణపడి ఉన్నాను అంటే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మాత్రమేనని చంద్రబాబు నాయుడు అన్నారు.
జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
జీడీ నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. టీడీపీ కార్యక్రమాలు అమలులో మంచి పనితీరు కనబరిచిన కార్యకర్తలను సీఎం అభినందించారు.#CBNWithCadre #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/jRgdF3uiyu
— Telugu Desam Party (@JaiTDP) March 1, 2025