
AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
1.ఆర్థిక శాఖ
1-భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 205 ద్వారా సంప్రాప్తించిన అధికారానికి లోబడి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తదుపరి ఖర్చుల కోసం గ్రాంట్ల డిమాండ్ల అనుబంధ ప్రకటన ఆమోదం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2.ఉన్నత విద్యా శాఖ:
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీ (VVITU) ని బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీ కింద ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపనకు అనుమతి ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (స్థాపన, నియంత్రణ) చట్టం 2016 (చట్టం నం. 3 ఆఫ్ 2016) షెడ్యూల్‌ను సవరించడానికి ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. విద్యా ప్రణామాణ మెరుగుకు, ఉన్నత విద్య అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు, ఆర్థిక ప్రగతిని, పరిశోధనాత్మక సామర్థ్యాలను పెంచేందుకు ఈ సవరణ దోహదపడుతుంది.
3.పాఠశాల విద్యా శాఖ:
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం, 2025 ను ప్రవేశపెట్టడానికి రూపొందించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం, 2009 (RTE చట్టం, 2009), దాని క్రింద రూపొందించబడిన నియమాల ప్రకారం మునిసిపల్ పరిమితులు, ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఎ) రేట్లు, రవాణా సౌకర్యాల లభ్యత ఆధారంగా ఆవాసాలను కేటగిరీలు I, II, III, IVలుగా వర్గీకరించడం ద్వారా అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సమాన అవకాశాలు నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలను నియంత్రించేందుకు ఈ బిల్లు దోహదపడుతుంది.
4.పురపాల, పట్టణాభివృది శాఖ:
CRDA ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపుల సమీక్షకు సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులను ఆమోదించడానికి, అమరావతి భూ కేటాయింపు నియమ, నిబంధనలు, 2017 ప్రకారం మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్, APCRDA కి అనుమతి ఇవ్వడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5.పురపాల, పట్టణాభివృది శాఖ:
-(ఎ) రూ.390.06 కోట్ల విలువైన APTRANSCO 400KV DC లైన్ (18 KM) మరియు PGCIL 400KV DC లైన్ల (20 KM) రీరూటింగ్ యొక్క బ్యాలెన్స్ పనులకు మరియు రూ.1082.44 కోట్ల విలువైన N10 నుండి N13 – E1 జంక్షన్ వరకు UG కేబుల్స్ ద్వారా 220KV EHV లైన్ల రీరూటింగ్ బ్యాలెన్స్ పనులకు సంబందించి పరిపాలనా అనుమతుల నిమిత్తం
-(బి) ఈ పనులలో రూ.390.06 కోట్ల పనులను అంచనా నిర్మాణ వ్యయం కంటే 8.99% అదనపు మొత్తానికి మెస్సర్స్ పివిఆర్ కన్స్ట్రక్షన్స్, హైదరాబాద్, మెస్సర్స్ కె.రామ చంద్రరావు ట్రాన్సుమిషన్ & ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ సంయుక్తంగా చేపట్టేందుకు అనుమతిని నిస్తూ, అలాగే బెంగళూరులోని మెస్సర్స్ బిఎస్‌ఆర్‌ఐన్‌ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, బెంగుళూరు వారికి రూ.1082.44 కోట్లకు అంచనా వ్యయం కంటే 8.98% ఎక్కువ శాతానికి అప్పగించేందుకు చేసిన ప్రతిపాధనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
6.పురపాల, పట్టణాభివృది శాఖ:
-ప్యాకేజీ XXXXII క్రింద రూ.834.46 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ, జాతీయ రహదారి-16 వరకు E13 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
7.పురపాలక, పట్టణాభివృది శాఖ:
-ప్యాకేజీ XXXXI క్రింద రూ.307.59 కోట్లతో చేపట్టనున్న రోడ్లు నిర్మాణం, వరద నీటి కాలువ, పాత జాతీయ రహదారి మంగళగిరి వరకు E15 రోడ్డు విస్తరణకై ఏకమొత్తంగా 2 సంవత్సరాల Defect Liability Period తో పరిపాలనా అనుమతి ఆమోదం కోసం ADCL, విజయవాడ వారు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8.పురపాలక, పట్టణాభివృది శాఖ:
-(i) శాసనసభ, హైకోర్టు (ii) సచివాలయం, HOD టవర్ల నిర్మాణపు కాంట్రాక్టులను ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉన్న సమగ్ర నిర్మాణ సేవలకు సంబందించి కరెన్సీ సీలింగ్ నిబంధనను సవరించడానికి చేసి ప్రతిపాదకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
9.పురపాలక, పట్టణాభివృది శాఖ:
-రూ.22,607.11 కోట్ల విలువైన 22 పనులకు L1 బిడ్లను ఆమోదించడానికి APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదన, L1 బిడ్డర్లకు ఈ పనులను అప్పగించడానికి LOA జారీ చేయడం, APCRDA అథారిటీ వారి తీర్మానం నెం.491/2025 ద్వారా 512/2025 వరకు ఆమోదించిన నిర్ణయాన్ని అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
10.పురపాలక, పట్టణాభివృది శాఖ:
-ప్రపంచ బ్యాంకు, ADB, HUDCO, KfW మరియు ఇతర ఆర్థిక ప్రాజెక్టులకు సంబంధించిన రూ.15,095.02 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీకి సంబంధించి బోర్డు నిర్ణయాన్ని అమలు చేయడానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకై APCRDA అథారిటీ వారి తీర్మానానికై చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
11.జలవనరుల శాఖ:
-(i) రూ.180.00 లక్షలతో ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్, ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు,
-(ii) రూ.3797.00 లక్షలతో బుడమేరు డైవర్షన్ ఛానల్ యొక్క KM 3.840 నుండి KM 4.340 వరకు కుడి, ఎడమల వరద నివారణ రక్షణ గోడలకు నిర్మించేందుకు పరిపాలనా అనుమతి కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
12. ఐటి, ఇ & సి:
ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ & స్టార్టప్ పాలసీ (4.0) 2024-2029 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడానికి ITE&C విభాగానికి అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. పరిశ్రమలు, వాణిజ్య శాఖ:
రాష్ట్రంలో ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి M/s ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, M/s దాల్మియా సిమెంట్ (భారత్) లిమిటెడ్, M/s లులు గ్లోబల్ ఇంటర్నేషనల్, M/s సత్యవీడు రిజర్వ్ ఇన్‌ఫ్రాసిటీ (పి) లిమిటెడ్, M/s ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు M/s బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ప్రైవేట్ లిమిటెడ్ (యాక్షన్ టెసా) పెట్టుబడి ప్రతిపాదనలకై తే.13.03.2025దీన జరిగిన సమావేశంలో SIPB చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
14. పరిశ్రమలు, వాణిజ్య శాఖ:
-ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికుల గృహాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 93 వేల మంది చేనేత కార్మిక గృహాలకు మరియు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు లబ్దిచేకూర నుంది.
15.ఇంధన శాఖ
-AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురము మరియు శ్రీ సత్యసాయి జిల్లాల్లో 4000 MW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టులను M/s. AP NGEL హరిత్ అమృత్ లిమిటెడ్ ఏర్పాటు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
16.ఇంధన శాఖ
అన్నమయ్య అండ్ వైఎస్ఆర్ జిల్లాల్లో 1800 మెగావాట్ల ఆఫ్-స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ (OCPSP) ఏర్పాటు కోసం మెస్సర్స్ ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అటవీ పరిరక్షణార్థం 350 హెక్టార్ల (864.87 ఎకరాలు) భూమిని కేటాయించేందుకు చేసిన ప్రతి పాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
17.ఇంధన శాఖ
-కొత్త పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు మరియు ఇతర పునరుత్పాదక ఇంధన (సౌర/తేలియాడే సౌర/పవన) ప్రాజెక్టుల అమలు కోసం SPV ఏర్పాటు కై NHPCతో చేసుకున్న JV ఒప్పందాన్ని ఆమోదించడానికి APGENCO మేనేజింగ్ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 18.సాదారణ పరిపాలనా శాఖ (సమచార & పౌర సంబంధాలు)
-ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించేందుకు మూడు (03) ఫోటోగ్రాఫర్ పోస్టులు మరియు రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ బేసిస్ పై తీసుకునేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. దీని వలన G.O.Rt.No.1983, G.A.(I&PR), తేదీ 05.09.2019 లో జిల్లా కార్యాలయాలు మరియు కమిషనరేట్ ఆఫ్ I&PR శాఖకు మంజూరు చేయబడిన (15) వీడియోగ్రాఫర్ పోస్టులలో ఒక (01) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పోస్టు, ఒక (01) అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ పోస్టు మరియు రెండు (02) వీడియోగ్రాఫర్ పోస్టులను రద్దు చేసే ప్రతి పాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
19.వై.ఏ.టి. & సి:
వైయస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నం గ్రామంలో ‘ఒబెరోయ్ విలాస్’ రిసార్ట్ అభివృద్ధి కోసం మెస్సర్స్ ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్ (ఒబెరోయ్ గ్రూప్) కు సంబంధించి గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమిని మరియు ఆ స్థలానికి (45 మీటర్ల వెడల్పు) యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేస్తూ మరియు రిఎలైన్మ్మెంట్ కై తే. 13.03.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) తీసుకున్న నిర్ణయానికి సంబందించిన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. ఈ ప్రాజక్టు వ్యవస్థాన వలన దాదాపు 1500 ఉద్యోగాలు రానున్నాయి.
20.వై.ఏ.టి. & సి:
విశాఖపట్నంలోని భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ కు సంబంధించి తే.13.03.2025 దీన జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం కోసం చేసిన క్రింది ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
-ఎ) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలో కేటాయించిన 40.00 ఎకరాల భూమిని మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ కు హద్దులు నిర్ణయించడం.
-బి) చట్టపరమైన సంస్థను మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ నుండి మెస్సర్స్ మేఫేర్ హోటల్స్ & రిసార్ట్స్ (వైజాగ్) ప్రైవేట్ లిమిటెడ్ కు మార్చడానికి ఆమోదం.
-సి) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరం గ్రామంలోని మేఫేర్ బీచ్ రిసార్ట్స్ మరియు కన్వెన్షన్ కు మౌలిక వసతులైన రోడ్డు, విద్యుత్ మరియు నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను అందించే నిర్ణయం.
-ఈ ప్రాజెక్టు ఏర్పాటు వలన ప్రస్తుతానికి 200 మంది ఉద్యోగ అవకాశాలు కల్పనతో ఏడవ సంవత్సరం ప్రాజక్టు పూర్తి అయ్యే సమయానికి అదనంగా 750 మంది ఉద్యోగ అవకాశలు కలుతాయి.
21.సాంఘిక సంక్షేమ శాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల ఉప-వర్గీకరణపై శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా, I.A.S.(రిటైర్డ్), ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికపై మంత్రుల బృందం సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
22.రెవిన్యూ శాఖ
వై.ఎస్.ఆర్. జిల్లా పేరును వై.ఎస్.ఆర్. కడప జిల్లాగా మార్చాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
23. పురపాలక, పట్టణాభివృది శాఖ:
“YSR తాడిగడప మునిసిపాలిటీ” ని “తాడిగడప మునిసిపాలిటీ” గా పేరు మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీల చట్టం, 1965 షెడ్యూల్ X యొక్క కాలమ్ 2లో No.1 ను సవరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
24. జలవనరుల శాఖ
గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతల్లో అత్యవసర ప్రాతిపధికన రూ.6373.23 లక్షల వ్యయంతో నామినేషన్ పద్దతిలో తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన 517 పనుల పరిపాలనా అనుమతులను దృవీకరించేందుకు చేసిన పనులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి