
అమరావతి, ఏప్రిల్ 23: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 23) విడుదలకానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతోపాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను సైతం ఈ రోజు ప్రకటించనున్నారు. ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు టీవీ9 తెలుగు వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చు.
ఇక ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపి విద్యాసేవల్లో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై క్లిక్ చేసి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఫలితాలు క్షణాలు స్క్రీన్ పై పీడీఎఫ్ రూపంలో కనిపిస్తాయి. అలాగే లీప్ (ఎల్ఈఏపీ) మొబైల్ యాప్‌లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో ముగిసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,49,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.