
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అందాల భామ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే .. మరో వైపు లేడీ ఓరియెంటడ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది. అనుపమ పరమేశ్వరన్ ఫిబ్రవరి 1996లో కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు. 2015లో అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వం వహించిన ప్రేమమ్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. మొన్నటి వరకు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ భామ ఇటీవల గ్లామర్ గేట్లు ఎత్తేసింది. మొన్నామధ్య వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో అనుపమ తన అందాలతో కవ్వించింది.
ఇది కూడా చదవండి: ప్రేమించినవాడి కోసం మతం మార్చుకుంది.. పేరు మార్చుకుంది.. చివరకు ఇలా
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పాపులర్ అయిన అనుపమ.. ప్రస్తుతం తెలుగులో పరదా అనే చిత్రంలో నటిస్తుంది. అలాగే తమిళంలో మరిసెల్వరాజ్ దర్శకత్వంలో నటుడు ధ్రువ్ విక్రమ్ నటించిన బైసన్ సినిమాలో నటిస్తుంది. అలాగే రీసెంట్ గా అశ్వంత్ మరిముత్తు దర్శకత్వంలో నటుడు ప్రదీప్ రంగనాథన్ జోడిగా డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తుంది. సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా అనుపమ సినిమా పరదా సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఉంటుందని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన చిట్టి.. ఫరియా అబ్దుల్లా అదరగొట్టిందిగా..
పరదా సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు. సౌత్ స్టార్ బ్యూటీ సమంత. ఫిలిం సర్కిల్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం పరదా సినిమాలో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుందని అంటున్నారు. గతంలో అనుపమ సమంత ప్రధాన పాత్రలో నటించిన అఆ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అనుపమకు ఇదే తెలుగులో మొదటి సినిమా. ఆతర్వాత ఇప్పుడు మరోసారి అనుపమ, సమంత కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఈమెను మించిన హాట్ బ్యూటీ ఉంటుందా..! చేసింది రెండు సినిమాలు.. ఒకొక్క మూవీకి అందుకుంటుంది రూ.3 కోట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.