Andriod Phones: ఆండ్రాయిడ్ మొబైల్ ఉపయోగిస్తు్న్నారా..? అయితే మీరు ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే. గూగుల్ తాజాగా ఆండ్రాయడ్ యూజర్ల కోసం ఎమర్జెన్సీ లైవ్ వీడియో అనే ఫీచర్‌ను కొత్తగా ప్రవేశపెట్టింది. మీరు ఎమర్జెన్సీ పరిస్థితిని ఎదుర్కొనే సమయంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు ఎమర్జెన్నీ సిట్యూయేషన్లో ఉన్న సమయంలో అక్కడి విజువల్స్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. దీని ద్వారా మీరు ఆపదలో ఉన్న సమయంలో ఎదుటివారు లైవ్ విజువల్స్‌ను చూడటం వల్ల అక్కడి పరిస్థితిని తెలుసుకుని సహాయపడటానికి ఉపయోగపడుతుంది. అత్యంత వేగంగా మీకు ఎదుటివారు సహాయం చేయడంలో ఇది యూజ్ అవుతుంది.
ఒకే ట్యాప్‌తో ఆపదలో ఉన్నవారు తమ లైవ్ విజువల్స్‌ను ఈ ఫీచర్‌తో పంపచుకోవచ్చు. ఈ విషయాన్ని ఆండ్రాయిడ్ తన వెబ్సైట్లో పంచుకుంది. నేటి నుంచి తాము ఆండ్రాయిడ్‌లో ఎమర్జెన్నీ లైవ్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేస్తున్నామని. ఒకే ట్యాప్‌తో మీ కెమెరా నుంచి సురక్షితంగా లైవ్ విజువల్స్ స్ట్రీమింగ్ చేయవచ్చని తెలిపింది. ఎమర్జెన్సీ సమయంలో మీకు త్వరగా సహాయం అందటానికి, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపింది. ఆపదలో ఉన్న సమయంలో సహాయం చేసేవారు వచ్చేంతవరకు ప్రాణాలను రక్షించే పద్దతులను మీకు చెప్పవచ్చని స్పష్టం చేసింది.
Today, we’re launching Emergency Live Video, a new way to show emergency responders what you’re seeing when you call for help.
Learn more ⬇️https://t.co/39CMxPENpJ
— Android (@Android) December 10, 2025
ఆండ్రాయిడ్ ఎమర్జెన్నీ లోకేషన్ సర్వీస్ ఆధారంగా ఇది పనిచేయనుంది. ఆపదలో ఉన్న వ్యక్తికి తక్షణం సహాయం చేసేందుకు అతడి లొకేషన్ తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. జీపీఎస్, సెల్, వైఫై ఆధారంగా ఆపదలో ఉన్న వ్యక్తి లోకేషన్‌ను వెంటనే తెలుసుకోవచ్చు. ప్రస్తుతం జర్మనీ, మెక్సికో, అమెరికా దేశాల్లో ఆండ్రాయడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో అన్ని దేశాల్లో ప్రవేశపెపట్టనున్నారు. ఎమర్జెన్నీ పరిస్థితుల్లో అవతలి వ్యక్తి కాల్ లేదా టెక్ట్స్ రూపంలో వివరించాలని కోరినప్పుడు ఈ ఫీచర్ ఉఫయోగపడుతుందని గూగుల్ స్పష్టం చేసింది. కాగా మహిళలకు ఈ ఫీచర్ మరెంతగానే ఉపయోగపడనుంది. ఆపదలో ఎవరైనా సహాయం కావాలనప్పుడు వెంటనే అక్కడి పరిస్ధితిని ఇతరులకు వీడియో విజువల్స్ రూపంలో తెలుసుకోవచ్చు. దీని వల్ల మహిళలు ఇతరుల నుంచి త్వరితగిన సహాయం పొందవచ్చు. ఎమర్జెన్నీ పరిస్థితుల్లో అక్కడి సిట్యూయేషన్‌ను ఇతరులకు తెలిపేందుకు సమయం ఉండదు. ఒకవేళ చెప్పినా ఎదుటివారికి అర్థం కాకపోవచ్చు. అదే లైవ్ విజువల్స్ చూడటం వల్ల ఎదుటివారికి సులువుగా మీ పరిస్థితి అర్థమవుతుంది.
