
అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు భుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా హడలెత్తించింది. మాడుగుల మండలం మోదమాంబ కాలనీ శివారు లో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. కనక అనే మహిళ కల్లాలోని పశువుల పాకలో గిరినాగు దూరడాన్ని రైతు గమనించారు. తొంగి చూసేసరికి.. బుసలు కొడుతున్న శబ్దరావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. రైతు.. అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్ వెంకటేష్‌కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన.. వెంకటేష్.. పామును బంధించేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఆపాము పాక లోపల నుంచి పక్కనే ఉన్న చెట్టు పైకి పాకింది. హై స్పీడ్ గా కొమ్మలపై నుంచి చెట్టు పైకి వెళ్ళిపోయింది. భారీ గిరినాగు చెట్టు పైకి పోగుతుంటే ఒళ్ళు జల ధరించేలా అందరూ ఆందోళన చెందారు. చివరకు రెండు గంటల పాటు శ్రమించి కింగ్ కోబ్రాను పట్టుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పట్టుకున్న కింగ్ కోబ్రా ను అడవుల్లో విడిచిపెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి