
విండ్ పవర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే గాలి మరల దగ్గర ఉద్యోగం ఎంత ప్రమాదకరమో చూపించే సంఘటన అది… అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం నింబగల్ వద్ద గాలి మరలు మెయింటెనెన్స్ చేసే ఉద్యోగికి పెను ప్రమాదం తప్పింది. కొన్ని వందల అడుగుల ఎత్తులో గాలి మరల దగ్గర మరమ్మత్తు చేస్తుండగా సుందరేశన్ అనే ఉద్యోగి ప్రమాదవశాత్తు కాలుజారి అంత ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. అయితే ఐరన్ సేఫ్టీ రోప్ ఉద్యోగి సుందరేశన్ కాలికి చుట్టుకోవడంతో…. 300 అడుగుల ఎత్తులో తలకిందులుగా గంటకు పైగా వేలాడాడు. ఐరన్ రోప్ కాలికి చుట్టుకోకపోయి ఉంటే సుందరేశన్ అమాంతం గాలిమర పైనుంచి కింద పడి చనిపోయేవారు. కానీ అదృష్టం బాగుండి.. నేల మీద నూకలు ఉండి…. 300 అడుగుల ఎత్తులో ఐరన్ రోప్ కాలుకి చిక్కుకుని తలకిందులుగా వేలాడుతూ ఊండిపోాడు.
సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికుతులతో పాటు.. గాలి మరలో పనిచేసే తోటి ఉద్యోగులు సహాయక చర్యలు చేపట్టారు. సుందరేసన్ తో పాటు పనిచేసే మరో ఉద్యోగి అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ ప్రాణాలకు తెగించి మరొక ఐరన్ రోప్ సహాయంతో పైనుంచి కిందకు దిగి…. 300 అడుగుల ఎత్తున వేలాడుతున్న సుందరేసన్ వద్దకు చేరుకున్నాడు. మెల్లగా ఐరన్ రోప్‌ను వదులుతూ కిందకు దించారు. ఎట్టకేలకు అందరూ శ్రమించి సుందరేసన్ను సురక్షితంగా కిందుకు తీసుకొచ్చారు. ఐరన్ రోప్ కాలికి గట్టిగా చుట్టుకోవడంతో గాయాలతో అయినా సుందరేసన్ ప్రాణాలతో బయటపడ్డాడు.
300 అడుగుల ఎత్తులో వేలాడుతూ, ఊగుతున్న సుందరేసన్ ఏ క్షణంలోనైనా జారీ కింద పడతాడేమోనన్న అనుమానంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు గాలి మరి కింద పెద్ద వల ఏర్పాటు చేసి పట్టుకున్నారు. ఒకవేళ అంత ఎత్తు నుంచి జారిపడ్డా నేల మీద పడకుండా వలలో పడితే ప్రాణాలు కాపాడొచ్చని ప్రయత్నాలు కూడా చేశారు. అయితే కాలికి చుట్టుకున్న ఐరన్ రోప్ గట్టిగా ఉండడంతో దాదాపు గంటకు పైగా సుందరేసన్ అలా గాలిలో వేలాడుతూనే ఉన్నాడు. చివరకు అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్ సమాంతరంగా మరో ఐరన్ రోప్ వేసుకొని సుందరేసన్ వద్దకు చేరుకొని సురక్షితంగా కిందికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..