

కృష్ణా జిల్లాలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 2013 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య కాలంలో సీజ్ చేసిన మద్యం బాటిల్స్, నాటు సారాను అధికారులు ధ్వంసం చేశారు. మచీలీపట్నంలోని ఎస్పీ ఆఫీస్ ఆవరణలో వేలాది లిక్కర్ బాటిల్స్ వరుసగా పేర్చి రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ మద్యం విలు వ రూ.28.97లక్షలగా తేల్చారు. అలాగే.. పట్టుబడిన 685 లీటర్ల నాటుసారాను పోలీసు అధికారులు కాల్వలో పారబోశారు. ఇక.. అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతామన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ గంగధరరావు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..