
గోదావరి జిల్లాలలో సంక్రాంతి అంటేనే ఓ ప్రత్యేకత సాంప్రదాయం. కోడి పందాలు, బంధువులు, కొత్తల్లుళ్ల రాకతో సందడి సందడిగా ఉంటుంది. వచ్చే అతిధులకు మర్యాదల్లో రాజీ పడకుండా రకరకాల వంటకాలు ఒడ్డిస్తుంటారు. ఈ పండుగకు స్తోమత లేకపోయినా అప్పు చేసిన ముక్కనుమ రోజున నాటు కోడి కోస్తారు. అయితే ఈసారి కోడి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కొందామన్న దొరకని పరిస్థితి. దీన్ని గుర్తించిన ఓ ఎలక్ట్రానిక్ షాపు వ్యాపారి కొత్తగా ఆలోచించాడు. తమ షాపులో 10,000 దాటి కొనుగోలు చేస్తే నాటు కోడి ఇస్తానని ప్రకటించాడు. ఇక చూసుకోండి వస్తువులు కొనేందుకు జనం పోటెత్తారు. కొన్న అందరికీ భోగి రోజున ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ను ముఖ్య అతిథిగా పిలిచి ఆయన చేతులు మీదుగా కస్టమర్లకు నాటు కోళ్లను అందించాడు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.
