బాదం పప్పు తినడం ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. ప్రతి రోజూ నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల హెల్త్‌కి ఎంతో మంచిది. బాదం పప్పులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నా కావు. శరీరానికి ఎంతో మంచిది. శరీరానికి శక్తిని ఇస్తుంది. బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. బాదంతో ఎన్నో రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో బర్ఫీ కూడా ఒకటి. బాదంతో చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాక్లెట్లకు బదులు పిల్లలకు ఈ బర్ఫీలు హెల్త్‌కి మంచిది. మరి ఈ బాదం బర్ఫీ ఎలా తయారు చేస్తారు? ఈ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాదం బర్ఫీకి కావాల్సిన పదార్థాలు:
బాదం పప్పు, పంచదార లేదా బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, పాలు, క్రీమ్
బాదం బర్ఫీ తయారీ విధానం:
ముందుగా బాదం పప్పులో వేడి నీళ్లు వేసి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టాలి. అప్పుడే పప్పు బాగా నానుతుంది. రుచి కూడా పెరుగుతుంది. రాత్రి కూడా నానబెట్టి ఉదయాన్నే తయారు చేసుకోవచ్చు. బాదం బర్ఫీ తయారు చేయడం చాలా సులువు. పావు గంటలోనే సిద్ధం అయిపోతుంది. మరో గిన్నె తీసుకుని అందులో పాలు వేసి మరిగించాలి. చిన్న మంట మీద పాలు చిక్కబడేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత నానబెట్టిన బాదం పప్పును మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ఈ ముద్దని పాలలో వేసి బాగా మరిగించాలి.
ఇవి కూడా చదవండి
ఆ తర్వాత పంచదార లేదా బెల్లం పొడి, యాలకుల పొడి, నెయ్యి కొద్దిగా, క్రీమ్ వేసి అంతా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం దగ్గరగా మిశ్రమం అంతా అయ్యేంత వరకు ఉడికించాలి. దగ్గర పడ్డాక ఓ పళ్లెం తీసుకుని నెయ్యి రాయాలి. బాదం మిశ్రమాన్ని ప్లేట్లో వేసి అంతా పర్చాలి. మీకు నచ్చిన షేపులో కట్ చేసి.. ఓ గంట సేపు పక్కన పెడితే చాలు. ఎంతో రుచిగా ఉండే బాదం బర్ఫీ సిద్ధం.
