
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 చిత్రం రికార్డ్స్ సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత బన్నీ నటించనున్న ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడనే చర్చ సైతం నడిచింది. తమిళ్ డైరెక్టర్ అట్లీతో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారని.. అలాగే డైరెక్టర్ త్రివిక్రమ్ తో కలిసి మరో మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకు సరైన స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు బన్నీ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయనున్నాడట. దీంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారట డైరెక్టర్ అట్లీ. అలాగే ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం. ఒకటి హీరోగా.. మరొకటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.175 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ చిత్రాన్ని సన్ పిక్షర్స్ పెద్ద ఎత్తున నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమా కోసం బన్నీకి అంతంగా పారితోషికం ఇవ్వడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా నిర్మాణం ప్రారంభమవుతుంది.భవిష్యత్తులో, వర్తమానంలో జరిగే కథ అని చెబుతున్నారు. ఈ సినిమాలో పొలిటికల్ థ్రిల్లర్, భావోద్వేగ కుటుంబ పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ అందుకున్నాడు అట్లీ.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..