
అల్లు అర్జున్ ట్రెండ్‌లో ఉండటానికి రీజన్ కావాలా చెప్పండి? అంటూ కాన్ఫిడెంట్‌గా అడుగుతోంది అల్లు ఆర్మీ. శ్రీరామనవమి రోజు పొద్దున్నుంచీ అల్లు అర్జున్ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు అభిమానులు. ఏదో విషయం ఉండే ఉంటుందిగా అంటారా? మాట్లాడుకుందాం పదండి…
అల్లు అర్జున్ ఊర మాస్ అంటే, ఆ ఊరమాస్‌కి స్పెల్లింగ్ పలికే నరం అట్లీ. అలాంటిది ఇద్దరూ కలిస్తే సీన్లూ, సినిమా మామూలుగా ఉంటుందా? అంటూ మనసుకు నచ్చినట్టు ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్.
ఆఫ్టర్ పుష్ప చాప్టర్స్.. ఏదైనా ఈ సారి గ్లోబల్ రేంజ్లో ఉండి తీరాల్సిందేనన్నది వారి డిమాండ్. అందుకే బన్నీతో కొంచెం స్పెషల్‌గా ప్లాన్ చేశారట అట్లీ. బన్నీని డ్యూయల్ రోల్లో చూపిస్తారన్నది టాక్.
అయితే ఆ డ్యూయల్ రోల్ తండ్రీ కొడుకులుగా ఉంటుందా? లేకపోతే ఇంకేదైనా సర్ప్రైజింగ్గా ఉంటుందా? అనే డిస్కషన్ కూడా షురూ అయింది. మరికొందరైతే దువ్వాడ జగన్నాథమ్‌లో బన్నీ చేసిన డ్యూయల్ షేడ్స్ ని గుర్తుచేసుకుంటున్నారు.
అల్లు అర్జున్ – అట్లీ సినిమా అనౌన్స్ మెంట్‌తో పాటు షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి రీసెంట్‌గానే షూట్ జరిగిందన్నది చెన్నై సమాచారం. సో.. 2024లోనే కాదు, 2025లోనూ ఫ్యాన్స్ కి బంపర్ ట్రీట్ ప్లాన్ చేశారన్న మాట బన్నీ.