
హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉన్న తిది అక్షయ తృతీయ. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ ను జరుపుకోనున్నారు. ఈ రోజున మీరు ఏమి చేసినా.. ఎక్కువ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ సంపదను పెంచుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజించడం కూడా చాలా ముఖ్యం. ఉత్తర దిశను కుబేరుడి దిశగా పరిగణిస్తారు. ఇదే సంపద.. శ్రేయస్సు దిశ అని చెప్పడానికి కారణం.
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుడు దిశగా పరిగణిస్తారు. ధనానికి అధిపతి అయిన కుబేరుని ప్రత్యేక ఆశీస్సులు మీ పై ఉండాలంటే ఈ దిశలో మనం ఏమి ఉంచుకోవాలో ఏమి పెట్టుకోకూడదో తెలుసుకోవాలి. ఈ దిశలో టాయిలెట్ ఉండటం, వంటగది ఉండటం, తప్పు రంగులు వేయడం వంటి వాస్తు దోషాలను నివారించాలి. వాస్తు శాస్త్రంలో ఇంటిలోని ప్రతి దిశకు దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అందుకే ఇంటి లోపలి భాగం కూడా దిశానిర్దేశం చేసేలా ఉండాలి.
ఇంటి ఖజానా దిశ: సంపదకు అధిపతి అయిన కుబేరుడు ఉత్తర దిశకు అధిపతి కనుక ఇంటిలో డబ్బులను దాచే పెట్టెను ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. లక్ష్మీ దేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
నీలి రంగు : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర భాగంలో గోడ రంగు, కర్టెన్లు, ఇంటీరియర్ మొదలైన వాటిని ఎక్కువగా నీలి రంగుని ఉపయోగించండి. ఈ దిశలో ఇక్కడ నీలం రంగు పిరమిడ్‌ను కూడా ఉంచవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
ఈ దిశను కొంచెం తేలికగా ఉంచండి: ఈ ఉత్తర దిశ శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈ దిశలో బరువైన వస్తువులు లేదా ఫర్నిచర్ ఉంచడం మానుకోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు.
కుబేరుని విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలంటే: ఇంట్లో ఆర్థిక శ్రేయస్సును కొనసాగించడానికి ఇంటికి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని ఉంచండి. మీరు ఈ పని అక్షయ తృతీయ నాడు చేయాలి. ఇలా చేయడం వలన సంపాదకు లోటు ఉండదు. అంతేకాదు బంగారం, వెండిని కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కుబేర యంత్రం: ఈ రోజున కుబేర యంత్రాన్ని ఇంటికి తీసుకురావచ్చు. దీన్ని ఇంట్లో ఈ కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇంటికి ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ప్రతిష్టించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు లభిస్తుంది.
ఈ రోజున కుబేర కుంకుమను తీసుకురండి: ఈ రోజున, ఇంటికి ఆకుపచ్చ కుంకుమను తీసుకురండి. దీనిని కుబేర కుంకుమ అని కూడా పిలుస్తారు. ఇది మంచి ఆరోగ్యం, సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. దీనిని సంపద దేవుడు కుబేరుడికి పెట్టడానికి ఉపయోగిస్తారు.
జాడే మొక్కఇంటికి తీసుకురండి: జాడే మొక్కను కుబేరుడి మొక్కగా చెబుతారు. ఈ రోజున జాడే మొక్కను నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ మొక్కను ఉత్తర దిశలో నాటాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది.
ఈ ప్రత్యేక చర్యలతో, మీరు అక్షయ తృతీయ రోజున కుబెరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇంటిని సిరి సంపదలతో నింపవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు