
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మూవీస్ కోసం ఇటు తెలుగు ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొన్నాళ్లుగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈహీరో. గతేడాది తెగింపు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన అజిత్.. ఇటీవలే విడాముయార్చి సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష మరోసారి అజిత్ సరసన జత కట్టింది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎంతవాడు గానీ సినిమా సూపర్ హిట్ కాగా.. చాలా కాలం తర్వాత ఈ హిట్ కాంబో రిపీట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో కన్నడ హీరో అర్జున్ విలన్ పాత్రలో కనిపించగా.. హీరోయిన్ రెజీనా కీలకపాత్ర పోషించింది. తమిళంలో విడాముయార్చి పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో పట్టుదల పేరుతో రిలీజ్ చేశారు.
ఇక ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ త్రిపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అజిత్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజాగా దర్శకుడు షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అజిత్ కొత్త లుక్ ను విడుదల చేశాడు. ఆ ఫోటోలో, అజిత్ క్లీన్ షేవ్ తో కనిపిస్తున్నాడు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఉన్నట్లుగానే ఉన్నాడు. ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ ఫోటో పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎవర్ గ్రీన్ అజిత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం మంచి ఆదరణ పొంది విజయం సాధిస్తుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.
#AK Sirs new Avatar 😍😍😍😍😍😍😍😍😍❤️💥💥💥🔥🔥🔥🔥🔥🔥💣💣❤️🙏🏻 pic.twitter.com/9cNITWDKhL
— Adhik Ravichandran (@Adhikravi) March 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.