
AFG vs AUS, ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో 10వ మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా ఆట ఆగిపోయే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేసింది. ట్రావిస్ హెడ్ యాభై పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ అతనికి మద్దతు ఇస్తున్నాడు. వీరిద్దరి మధ్య 65 పరుగుల అజేయ భాగస్వామ్యం ఉంది. బ్యాడ్ వెదర్‌తో అంపైర్లు మైదానాన్ని తనిఖీ చేసి, ఆట ఇక ముందుకు సాగదని ప్రకటించారు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడంతో ఇరుజట్లుకు చెరో పాయింట్ లభించింది. దీంతో ఆఫ్ఘాన్ జట్టు సెమీస్ చేరకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు సెమీస్ చేరుకుంది.
అంతకుముందు శుక్రవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. సెదికుల్లా అటల్ 85 పరుగులు, అజ్మతుల్లా ఒమర్జాయ్ 67 పరుగులు చేశారు. బెన్ ద్వార్షిస్ 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..