
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్లలో లయ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ గా కనిపిస్తూ అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో ఎక్కువగా నటిస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన లయ.. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా ఆమె ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిందీ. హనుమాన్ జంక్షన్, ప్రేమించు, మిస్సమ్మ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది.
2006లో అమెరికాకు చెందిన డాక్టర్ శ్రీ గణేశన్ ను వివాహం చేసుకుంది లయ. ఆ తర్వాత భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. లయ దంపతులకు పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన లయ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ అయ్యింది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి తిరిగి ఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు లయ కూతురి ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
లయ కూతురి పేరు శ్లోకా. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. మాస్ మాహారాజా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా చిన్నప్పటి పాత్రలో నటించింది. శ్లోకా చూడటానికి అచ్చం అమ్మలాగే ఉంటుంది. ఇటీవల తన కూతురితో కలిసి కొన్ని ఫోటోస్ షేర్ చేసింది లయ. తన కూతురు హీరోయిన్ అయితే చూడాలని ఉందని గతంలో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది లయ.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..