
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది లైలా. అప్పట్లో ఆమె టాప్ హీరోయిన్. శ్రీకాంత్, జేడీ చక్రవర్తి నటించిన ఎగిరే పావురమా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అందం, అభినయంతో జనాలను కట్టిపడేసింది. సహజ సౌందర్యం, సొట్టబుగ్గలు, చూడగానే కట్టిపడేసే రూపంతో అడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకుంది. 1997లో విడుదలైన ఎగిరే పావురమా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అనేక చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఏలేసిన లైలా.. 2006లో మెహదీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.
పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది లైలా. దాదాపు 16 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లైలా.. 2022లో సర్దార్ సినిమాతో తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. అలాగే గతేడాది విజయ్ దళపతి నటించిన గోట్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది. అయితే లైలా ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. లైలాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి అంతగా బయటకు తెలియనివ్వలేదు లైలా.
తాజాగా లైలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. అందులో లైలా ఇద్దరు కొడుకులను చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. తమ ఫేవరేట్ హీరోయిన్ కు ఇంతపెద్ద కొడుకులు ఉన్నారా ? అప్ కమింగ్ హీరోస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో లైలాకు మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో లైలా తనయులు సైతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..