
సాధారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్స్ ఎక్కువగా వేర్వేరు ప్రదేశాలలో ఆస్తులు కొనడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ నుండి అలియా భట్ వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట ఇళ్ళు, భూములు వంటి ఆస్తులలో పెట్టుబడి పెట్టారు. ఈ జాబితాలో మరో హీరోయిన్ చేరింది. బీటౌన్ టాప్ హీరోయిన్ కాజోల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మరింత పాపులర్ అయ్యింది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న కాజోల్.. ఇప్పుడు ముంబైలోని అత్యంత నాగరిక ప్రాంతంలో కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది.
కాజోల్ ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసింది. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ వంటి ప్రముఖుల తర్వాత కాజోల్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది. రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ ఇండెక్స్‌ట్యాప్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం.. కాజోల్ ముంబై శివారులో రూ.28.78 కోట్ల విలువైన రిటైల్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇండెక్స్ ట్యాప్ పొందిన ఆస్తి పత్రాల ప్రకారం, కాజోల్ గోరేగావ్ వెస్ట్‌లో రూ.28.78 కోట్లకు ఒక వాణిజ్య ఆస్తిని కొనుగోలు చేసింది. ఆస్తి కొనుగోలు ఒప్పందం మార్చి 6, 2025న సంతకం చేయబడింది. కాజోల్ రూ.1.72 కోట్ల స్టాంప్ డ్యూటీని కూడా చెల్లించింది. ఈ రిటైల్ స్థలం కోసం కాజోల్ రూ.28.78 కోట్లు చెల్లించింది. దీనికి ఐదు కార్ల పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. అంతకుముందు, కాజోల్ 2023లో ఓషివారాలోని సిగ్నేచర్ భవనంలో రూ.7.64 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసింది. చాలా మంది సినిమా కళాకారుల కార్యాలయాలు ఓషివారాలోని వీర దేశాయ్ రోడ్డులో ఉన్నాయి. కాజోల్ అదే ప్రాంతంలో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది.
కాజోల్ లాగే, ఆమె భర్త, నటుడు అజయ్ దేవగన్ కూడా 2023లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెద్ద పెట్టుబడి పెట్టారు. అజయ్ దేవగన్ ఐదు కార్యాలయాలను కొనుగోలు చేశారు. ఈ మూడు కార్యాలయాల ఖర్చు ఇప్పుడు రూ.30 కోట్ల 35 లక్షలు కాగా, మిగిలిన రెండు కార్యాలయాల ఖర్చు రూ.14 కోట్ల 74 లక్షలు.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..