
ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో ఆమె టాప్ హీరోయిన్. 90వ దశకంలో అగ్ర కథానాయిగా దూసుకుపోయిన హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు. అందం, అభినయంతో అప్పట్లో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషలోల ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అమ్మ దొంగ, యమలీల, హలో బ్రదర్, వజ్రం, జగదేకవీరుడు అతిలోకసుందరి పెద్దన్నయ్య, చిన్నబ్బాయి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. చేతినిండా సినిమాలతో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. మొహమ్మద్ అబ్సర్ అనే టెలివిజన్ ఆర్టిస్టును పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ తీసుకుంది. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే సమయం కేటాయించింది.
చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇంద్రజ. పలు స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే ఇటు బుల్లితెరపై పలు రియాల్టీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవలే రజాకర్, ప్రతినిధి, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. అటు సినిమాలు, ఇటు షోలతో బిజీగా ఉంటున్న ఇంద్రజ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం వరుస ఫోటోషూట్స్, రీల్స్, ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఇంద్రజ కూతురి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇంద్రజ కూతురి పేరు సారా. అందంలో అచ్చం తల్లిని మించిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. ఇంద్రజ బ్రహ్మాణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తమిళ టీవీ నటుడు అబ్సర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో ఆమె పెళ్లిని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ఇంద్రజ చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..