ఆధార్ కార్డులోని చిన్న తప్పు కూడా పెద్ద సమస్యలను సృషిస్తుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా పెద్ద నష్టం జరగవచ్చు. ఆధార్ వివరాల్లో తప్పుల వల్ల బ్యాంక్ కేవైసీ ఇబ్బందుల నుంచి ప్రభుత్వ పథకాల ఆలస్యం వరకు అనేక సేవల్లో అంతరాయం కలగవచ్చు. మిగతా వివరాలు అలా ఉంచితే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆధార్ కార్డులో ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోవాలి. తప్పుగా ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఇందుకోసం కఠిన రూల్స్ యూఐడీఏఐ ప్రవేశపెట్టింది.
ఈ డాక్యుమెంట్స్ అవసరం
కొంతమంది ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆధార్ కార్డులోని డేట్ ఆఫ్ బర్త్ను పదే పదే మార్చుకుంటున్నారు. దీంతో జనన ధృవీరణ వివరాలు మార్చుకునేందుకు యూఐడీఏఐ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. డేట్ ఆఫ్ బర్త్ వివరాలు మార్చుకునేందుకు బలమైన ధృవీకరించిన పత్రాలు మాత్రమే స్వీకరిస్తారు. డేట్ ఆఫ్ బర్త్, పాస్ పోర్ట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, మార్క్ షీట్లు లాంటి పత్రాలు మాత్రమే స్వీకరిస్తారు. ఇక అఫిడవిట్లు, ఆస్పత్రి లేఖలు పనిచేయవు. డాక్యుమెంట్లలో మీ పూర్తి పేరు, ఖచ్చితమైన పుట్టిన తేదీ స్పష్టంగా కనిపించాలి. స్పెల్లింగ్ లేదా ఫార్మట్లో ఏదైనా తేడా ఉంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు.
ఆన్లైన్లో అప్లై చేసుకున్నా..
డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఆన్లైన్లో మార్చుకునే అవకాశం ఉన్నా ఒక్కొసారి చాలా దరఖాస్తులను ఆఫ్లైన్ ధృవీకరణకు మళ్లించబడడతాయి. డాక్యుమెంట్ల స్కానింగ్, బయోమెట్రిక్ నిర్ధారణ కోసం ఆధార్ సేవా కేంద్రాలను సందర్శించాల్సిందిగా యూఐడీఏఐ కోరుతుంది. దీంతో 2026లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవాలంటే భౌతిక ధృవీకరణ అవసరమవుతుంది. వయస్సు వ్యత్యాసాలు ఎక్కువగా కనిపించినప్పుడు తప్పనిసరిగా ఆఫ్లైన్ ధృవీకరణకు మార్చబడుతుంది.
ఎంత సమయం పడుతుందంటే..
ఇక డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ కోసం సాధారణంగా 7 నుంచి 30 రోజుల వరకు సమయం పడుతుంది. వివరాలు స్పష్టంగా ఉంటే వెంటనే ప్రాసెస్ అవుతుంది. అతే మాన్యువల్ సమీక్ష అవసరమైతే దరఖాస్తులు ప్రాసెస్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. మీరు ఒకేసారి మల్టీఫుల్ టైమ్స్ రిక్వెస్ట్ పెట్టడం లేదా ఏజెంట్లను ఆశ్రయిస్తే ప్రక్రియ మరింత ఆలస్యం కావొచ్చు. డాక్యుమెంట్లలో ఫొటో క్లియర్గా లేకపోవడం, తేదీలను అస్పష్టంగా ఉండటం, పేర్లలో తేడాలు ఉండటం వల్ల మీ రిక్వెస్ట్ రిజెస్ట్ అవుతుంది. ఒకసారి రిక్వెస్ట్ తిరస్కరణకు గురైన తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకోవడం కూడా సంకిష్టంగా ఉంటుంది.
