అభం శుభం తెలియని చిన్నారిని కసాయి తల్లిదండ్రులు ముళ్ళ పొదల్లోకి విసిరేసిన దయనీయ సంఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమం ఆసుపత్రి శివారు ప్రాంతం రైల్వే ట్రాక్ పక్కన ముళ్ళ పొదల్లో ఆరేళ్ల చిన్నారిని విసిరేశారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో సడి ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించి తల్లడిల్లిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చిన్నారిని అంబులెన్స్‌లో ఆశ్రమం ఆసుపత్రికి తరలించారు.
బాలికకు ఆరేళ్ల వయసు ఉంటుందని పోలీసులు గుర్తించారు. చిన్నారికి మెదడు సరిగ్గా ఎదగక పోవడంతో బుద్ధి మాంద్యంతో బాధపడుతుంది. అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఎవరు ఈ ఘటనకు పాల్పడ్డారనే దానిపై విచారణ చేపట్టామన్నారు. చిన్నారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మానసిక వికలాంగురాలు అన్న కనికరం లేకుండా ముళ్ళ పొదల్లో వదిలిన వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
