
చాలా మందికి స్వీట్లు అంటే ఇష్టంగా తింటారు. ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. స్వీట్ ఐటెమ్స్ ఎక్కడ కనిపించినా పొట్టలో వేసేస్తారు. ఏమీ లేకపోయినా కనీసం పంచదార అయినా తింటూ ఉంటారు. ఇలా ఎక్కువగా తీపి పదార్థాలు తినాలనిపిస్తే.. అందుకు ఈ సమస్యే కారణం కావచ్చు.
మీకు ఎక్కువగా స్వీట్లు తినాలి అనిపిస్తూ ఉంటే.. దీన్ని సాధారణ సమస్యగా తీసుకోకూడదు. ఇలాంటి బలహీనతకు ఉంటే రకరకాల అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు. డయాబెటీస్ లేదా ఈ విటమిన్ లోపం కారణంగా కూడా అనిపిస్తుంది.
డయాబెటీస్ లేని వారికి విటమిన్ బి లోపం కారణంగా కూడా స్వీట్లను ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఈ విటమిన్ చక్కెర, శక్తికి సంబంధించింది. శరీరంలో ఇవి లోపిస్తే బ్రెయిన్‌కి స్వీట్లు తినాలని పదే పదే గుర్తు చేస్తుంది. దీంతో చాలా మంది తీపి పదార్థాలు తింటారు.
ఇక శరీరంలో పరిధికి మించి గ్లూకోజ్ స్థాయిలు పెరిగే మాత్రం.. షుగర్ వ్యాధితో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం, బరువు పెరుగుతూ ఉంటారు. కొన్ని రకాల పోషకాల లోపం కారణంగా కూడా తీపి తినాలనే కోరిక పెరుగుతుంది.
ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, జింక్ వంటి ఖనిజాలు తగ్గినా కూడా తీపి తినాలనే కోరిక పెరుగుతుంది. కొన్ని రకాల హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. కాబట్టి మీకూ ఈ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుల్ని సంప్రదించడం మేలు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)