
మ్యాగీ అంటే చాలా మందికి ఇష్టం. ఎప్పుడైనా ఆకలిగా ఉందంటే అప్పటికప్పుడు మ్యాగీ తయారు చేసుకుని తింటారు. మ్యాగీకి చాలా మంది లవర్స్. మ్యాగీలో వెజిటేబుల్స్, మసాలా ఇలా యాడ్ చేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇక నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్, ఫిష్, ఎగ్ ఇలా వారికి నచ్చినవి యాడ్ చేసుకుని తింటూ ఉంటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంత టేస్టీగా ఉండే మ్యాగీతో కట్ లెట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కాస్త వెరైటీగా తినాలి అనుకునేవారు వీటిని ట్రై చేయవచ్చు. మరి మ్యాగీ కట్ లెట్స్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మ్యాగీ కట్ లెట్స్కి కావాల్సిన పదార్థాలు:
మ్యాగీ, కారం, ఉప్పు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, వెల్లుల్లి తరుగు, క్యారెట్ తరుగు, ఉడికించిన ఆలూ, మిరియాల పొడి, మ్యాగీ మసాలా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, ఆయిల్.
ఇవి కూడా చదవండి
మ్యాగీ కట్ లెట్స్ తయారీ విధానం:
ముందుగా మ్యాగీ ఉడికించి పక్కన పెట్టాలి. ఇలా ఉడికించుకున్న మ్యాగీలో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మసాలాలు అన్నీ వేసి మిక్స్ చేయాలి. మ్యాగీని ఉడికించి వేసుకోవచ్చు. ఇలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కూడా నలిపి వేయవచ్చు. ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇది కాస్త క్రంచీగా ఉంటుంది. క్రంచీగా కావాలి అనుకునేవారు ఇలా వేసుకోవచ్చు. కాస్త మెత్తగా కావాలి అనుకుంటే.. మ్యాగీని ఉడికించి వేసుకుంటే.. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడియాలి. ఈలోపు మ్యాగీ మిశ్రమంతో కట్ లెట్స్ చేసి పెట్టుకోవాలి. ఇవి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మ్యాగీ కట్ లెట్స్ సిద్ధం. వీటి రుచి కాస్త భిన్నంగా ఉంటాయి. మ్యాగీ కట్ లెట్స్ టేస్ట్ చేయాలి అనుకుంటే ఇలా చేసేయండి. వీటిని టమాటా కిచెప్తో తింటే చాలా రుచిగా ఉంటాయి.