
మనలో చాలామంది ఎక్కువ జీతంతో మంచి ఉద్యోగం పొందాలని కోరుకుంటారు. మంచి జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకుని వ్యవసాయం లేదా ఇతరత్రా సొంత వ్యాపారం చేసి విజయం సాధించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఓ యువతి కూడా అలాంటి పనినే ఎంచుకుంది. మంచి జీతంతో కూడిన ఉద్యోగం వదిలేసి ఎవరూ చేయని విధంగా పందుల పెంపకం చేపట్టింది. ఆ యువతి తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషకర సమయాన్ని గడపడానికి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు పందుల పెంపకం చేస్తుంది.. దీనికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
చైనాలోని షాంఘైకి చెందిన యాంగ్ యాంక్సీ అనే 27 ఏళ్ల యువతి పందుల పెంపకం కోసం ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదులుకుంది. ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఆమె ఒక టాప్ ఎయిర్‌లైన్ కంపెనీలో 5 సంవత్సరాలుగా ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసింది. అయితే ఆ తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి పందుల పెంపకం ప్రారంభించింది. అవును, ఆమె తన బంధువుల పొలంలో పందుల పెంపకం నిర్వహిస్తోంది. ఇందుకు ఆమె బలమైన కారణం చెబుతోంది. ఆమె తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషకర సమయాన్ని గడపడానికి ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాన్ని వదిలి ఇప్పుడు పందుల పెంపకం నడుపుతోంది. అలాగే, ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెతో ఆనందంగా ఉంటున్నామని చెబుతున్నారు.
ఏప్రిల్ 2023లో యాంగ్ బంధువుల పొలంలో పందుల పెంపకాన్ని ప్రారంభించింది.. ఇప్పుడు ఆమె వాటికి ఆహారం తయారు చేసి అందిచడం, నుండి వాటికి కావాల్సిన ప్రతిదీ చేస్తోంది. అంతేకాకుండా, ఆమె తన గ్రామ జీవితానికి సంబంధించిన వ్లాగ్‌లను కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. పందులు, ఇతర పశువులను సోషల్ మీడియా మార్కెట్లో విక్రయించడం ద్వారా గత రెండు నెలల్లో 2000,000 యువాన్లు ($27,000) సంపాదించినట్లు యాంగ్ పేర్కొన్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో పందుల పెంపకాన్ని విస్తరించడమే కాకుండా హోటల్ వ్యాపారం కూడా ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..