తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం బైరాగిపట్టెడలో టోకెన్ల జారీ చేపట్టారు. భక్తుల తాకిడి అంచనా వేయలేక బారికేడ్లు లేకపోవడం వల్ల తొక్కిసలాట జరిగింది. భారీగా చేరుకున్న భక్తులు టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకూ పక్కనే ఉన్న పద్మావతి పార్క్‌లోకి భక్తుల్ని పంపారు పోలీసులు. ఓ భక్తురాలు అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రికి తరలించేందుకు డీఎస్పీ రమణకుమార్ గేటు తీశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగింది.

Tirupati Darshan Stampede
