ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. అయితే కొంత మంది అధికంగా నిద్రపోతుంటారు. ఇది సాధారణమని అందరూ అనుకుంటారు. మీరు తెలుసా ఇది విటమిన్ లోపాల వల్ల కలిగే ఓ రుగ్మత. విటమిన్ బి12, ఐరన్, విటమిన్ డి, మెగ్నీషియం లోపాలు అలసట, అధిక నిద్రకు కారణమవుతాయి.
అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి ప్రమాదకరం. విటమిన్ లోపాలు కూడా అతిగా నిద్రపోవడానికి కారణమవుతాయి. విటమిన్ బి12 శక్తికి అతిపెద్ద వనరు. ఇది ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. దీని లోపం అలసట, అధిక నిద్రకు కారణమవుతుంది.
విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికిపాలు, పెరుగు, గుడ్లు, చేపలు, జున్ను తీసుకోవడం మంచిది. ఐరన్ లోపం వల్ల కూడా మెదడు, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీని వలన అలసట, అధిక నిద్ర వస్తుంది.
పాలకూర, బీన్స్, మటన్, పప్పు వంటి ఆకు కూరలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల అధిక అలసట, అధిక నిద్ర వస్తుంది. విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కూర్చోవాలి. అలాగే పాలు, పెరుగు, పుట్టగొడుగులు, చేపలు, గుడ్లలో కూడా విటమిన్ డి అధికంగా లభిస్తుంది.
అధిక నిద్రకు కారణం శరీరంలో మెగ్నీషియం లేకపోవడం. ఇది శరీరాన్ని విశ్రాంతిని ఇస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి బాదం, పాలకూర, గుమ్మడికాయ గింజలు, అరటిపండ్లు, జీడిపప్పులను తీసుకోవడం మంచిది.





