
ఇకపై ఖాతాల బదిలీని మరింత సరళతరం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులు బాటును జనవరి 18 శనివారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా యాజమాన్యాల చుట్టూ తిరగడం, సమయం వృథా కావడం తప్పుతుంది. అయితే, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన UAN తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్వో తెలిపింది. వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్లైన్లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. షరా మామూలుగానే వారి యాజమాన్యాలే ఈ పని చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అట్లుంటది అంబానీతోని.. రూ.49లకే అన్లిమిటెడ్ డేటా..