విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. జులై 31న విడుదలైన కింగ్డమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన కింగ్డమ్ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా కింగ్డమ్ సినిమా కు మంచి ఓపినింగ్స్ వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమాకు ఫస్ట్ రోజే 50 శాతం ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం మొదటి రోజు కింగ్డమ్ సినిమా దాదాపు రూ.30కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. తోలి రోజు కలెక్షన్స్ తోనే విజయ్ కెరీర్ లోనే బిగెస్ట్ ఓపినింగ్స్ సాధించింది కింగ్ డమ్.
ఇది కూడా చదవండి :కోటీశ్వరుల సంబంధాలకు నో చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లాడింది.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
అంటే కింగ్డమ్ మొదటి రోజు రూ.15.75 కోట్ల షేర్స్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరిర్ లో అత్యంత విజయవంతమైన ప్రారంభరోజు ప్రదర్శనలలో ఇది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. ఇక అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మాస్ మావ..! ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. స్టార్స్ లేకుండానే బ్లాక్ బస్టర్
తొలి రోజే కాదు రెండో రోజు కూడా కింగ్డమ్ సినిమాకు అదిరిపోయే బుకింగ్స్ జరిగాయని తెలుస్తుంది. బుక్ మై షోలో మరో రికార్డ్ క్రియేట్ చేసింది కింగ్ డమ్ సినిమా.. కేవలం గంటలోనే 8.64 వేల టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ మేరకు కింగ్ డమ్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండో రోజు కూడా కింగ్ డమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇక కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్, మలయాళ నటుడు వెంకటేష్ కీలక పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక అనిరుధ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది.
ఇది కూడా చదవండి : ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేశాడు.. ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు.. అతను ఎవరంటే
#Kingdom is ruling the box office 🔥🔥
Day 2 noon shows started with a bang with over 8.64K+ tickets being booked hourly on @BookMyShow 💥
This truly shows the impact of the film!! pic.twitter.com/2ZhZIrGsKW
— KINGDOM (@KINGDOM_Offl) August 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
