ఏ ఆస్పత్రి నుంచి కూడా వారికి స్పష్టమైన హామీ దొరకలేదు. పాపకు ఆరేళ్ల వయసు వచ్చినప్పుడు ఒక సపోర్ట్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు సమాధానం దొరికింది. ఆన్ లైన్ కమ్యూనిటీలో ఓ వ్యక్తి తనకు విజయవంతంగా జరిగిన స్కోలియోసిస్ సర్జరీ గురించి వివరించడంతో వారికి కొత్త ఆశ చిగురించింది. ఆ ఆశతో వారు బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్ విద్యాధరన్ ను సంప్రదించారు. పాపకు పరీక్షలు చేసిన డాక్టర్ ఆమె వెన్నుపూస 86 డిగ్రీల వక్రతతో ఉన్నట్లు గుర్తించారు. ఇది థొరాసిక్ స్కోలియోసిస్ అనే వ్యాధి.
