ఉడిపి శ్రీ కృష్ణ మఠం: కర్ణాటకలోని ఈ ఆలయం సాంప్రదాయ విగ్రహారాధనతో సహా ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీ కృష్ణుని అతి ముఖ్యమైన ఆలయం. ఈ ఉడిపి శ్రీ కృష్ణ మఠంను 13వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి శ్రీ మధ్వాచార్య స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న తొమ్మిది రంధ్రాల నుంచి భక్తులు శ్రీకృష్ణుని దర్శిస్తారు. ఈ కిటికీని కనకన కింది అంటారు. ఈ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణుడిని విఠలుడు అని అంటారు. ఇక్కడ జన్మాష్టమి రోజున జరిగే వేడుకలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. దేవాలయం అంతా పువ్వులతో, పండ్లతో, దీపాలతో అలంకరిస్తారు.
