ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. అడవిలో నుంచి తప్పిపోయిన ఒక ఎలుగుబంటి గ్రామానికి చేరుకుని అనుకోకుండా ఒక వ్యవసాయ బావిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎలుగుబంటిని రక్షించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ సహకారంతో ఎట్టకేలకు దాన్ని గడ్డకు చేర్చారు. బావి లోతైనదిగా ఉండటంతో దాన్ని బయటకు తెచ్చేందుకు 2 గంటలు కష్టపడాల్సి వచ్చింది. మనకెందుకులే అనుకోకుండా గ్రామస్తులు అందరూ కలిసి ఎలుగుబంటిని రక్షించడం అభినందనీయం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
